China : కొన్ని అమెరికా వస్తువులపై చైనా మినహాయింపు!

అమెరికా నుంచి వచ్చే కొన్ని రకాల దిగుమతుల (Imports)కు 125 శాతం పన్ను నుంచి మినహాయింపు ఇవ్వాలని బీజింగ్ భావిస్తోందని సమాచారం. చైనా-అమెరికా మధ్య వాణిజ్య యుద్ధం ఇప్పటికే కొన్ని రకాల పరిశ్రమల (Industry) కు ముప్పుగా మారింది. ఈ నేపథ్యంలో పరిశ్రమల్లో ఈథేన్ వంటి రసాయనాలు, వైద్య పరికరాల వంటి వాటిపై మాత్రం పన్ను సడలించే అంశాన్ని పరిశీలిస్తోంది. ఇక విమానాల లీజులు (Aircraft leases) వంటి వాటిపై కూడా పన్నులను మినహాయించాలని బీజింగ్ చూస్తోందని సమాచారం. చైనాలో చాలా వరకు విమానయాన సంస్థలు థర్డ్‌పార్టీ నుంచి ఎయిర్‌క్రాఫ్ట్‌లను లీజుకు తీసుకొని చెల్లింపులు చేస్తాయి. ఇవి ఆర్థికంగా అదనపు టారీఫ్‌ల పరిధిలోకి రావడం సమస్యాత్మకంగా మారింది.
అమెరికా(America )-చైనా ఈ నెలలో పోటాపోటీగా పరస్పర సుంకాలు విధించుకున్నాయి. వాషింగ్టన్ 145 శాతం సుంకాలు ప్రకటించగా, చైనా ప్రతిస్పందిస్తూ 125 శాతం విధించింది. ఈ నేపథ్యంలో ఇరు దేశాలు చర్చలు జరుపుతున్నాయని ట్రంప్(Trump) ప్రకటించారు. కానీ, ఆయన ప్రకటన వాస్తవం కాదని, ఎటువంటి సంప్రదింపులు లేవని బీజింగ్ స్పష్టం చేసింది. ఈ మేరకు చైనా విదేశాంగ ప్రతినిధి వెల్లడించారు.