America: నిప్పుతో ఆటలొద్దు… అమెరికాకు చైనా హెచ్చరిక
అమెరికా వైఖరి పట్ల చైనా మరోసారి ఆగ్రహించింది. ఇండో-పసిఫిక్ అంశంలో అమెరికా రక్షణమంత్రి పీట్ హెగ్సెత్ (Pete Hegseth) చేసిన వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండిరచింది. తైవాన్ అంశాన్ని హెగ్సెత్ ప్రస్తావంచడాన్ని బీజీంగ్ విదేశాంగ మంత్రిత్వశాఖ తప్పుబట్టింది. ఈ నేపథ్యంలో యూఎస్‌కు గట్టి హెచ్చరికలు చేసింది. తమను కట్టడి చేయాలనే కుట్రలతో తైవాన్ (Taiwan) సమస్యను తెరపైకి తీసుకొస్తే సహించేది లేదు. ఇది సరైన పద్ధతి కూడా కాదు. నిప్పుతో ఆడుకోవద్దు. తైవాన్ అంశం చైనా (China)లో అంతర్గత వ్యవహారం. దీనిలో మూడో దేశం జోక్యం మానుకుంటే మంచిది అని చైనా విదేశాంగ ప్రతినిధి లిన్ జియాన్ (Lin Jian ) వ్యాఖ్యానించారు. కాగా, పీట్హెగ్సెత్ సింగపూర్‌లో జరిగిన అంతర్జాతీయ భద్రతా సదస్సులో మాట్లాడుతూ ఈ మేరకు పేర్కొన్నారు.
భౌగోళిక, సముద్ర వివాదాల పరిష్కారంతోపాటు తైవాన్ విషయంలోనూ చైనా ఏకపక్షంగా వ్యవహరిస్తోందని అన్నారు. భవిష్యత్‌లో ఆ దేశం నుంచి వచ్చే ముప్పును ముఖ్యంగా తైవాన్‌పై దాని దూకుడు ప్రదర్శనను ఎదుర్కొనడానికి యూఎస్ విదేశాల్లో తన రక్షణను బలోపేతం చేస్తోందని అన్నారు. అదే సమయంలో తైవాన్ను స్వాధీనం చేసుకునేందుకు చైనా దాని చుట్టూ సముద్రజలాల్లో యుద్ధ విమాన వాహక నౌకలను మోహరిస్తూ బెదిరింపులకు పాల్పడుతోందని పేర్కొన్నారు. లాటిన్ అమెరికాపైనా చైనా కన్నేసిందని, పనామా కాలువపై తన ఆధిపత్యాన్ని పెంచుకునేందుకు కృషి చేస్తోందని అన్నారు.







