మైక్రోసాఫ్ట్ విజయం వెనుక భారతీయుల కృషి : బిల్ గేట్స్
భారత్‌తో తనకున్న అనుబంధం గురించి ప్రతీ సందర్భంలోనూ చెబుతుంటారు మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్. తాజాగా జిరోదా సహ వ్యవస్థాపకుడు నిఖిల్ కామత్ నిర్వహించిన పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్న ఆయన ఈ విషయంపై మాట్లాడారు. మైక్రోసాఫ్ట్ విజయం వెనక భారతీయుల కృషి ఉందని పేర్కొన్నారు. దీంతో పాటు ఆర్టిపిషియల్ ఇంటెలిజెన్స్ వంటి కొన్ని ఇతర అంశాలపైనా వీరు చర్చించుకున్నారు. నిఖిల్ కామత్ తాజాగా ఓ పాడ్‌కాస్ట్ సరీస్‌ను ప్రారంభించారు. ఈ ప్రోగ్రామ్ మొదటి గెస్ట్‌గా వచ్చిన బిల్‌గేట్స్ మాట్లాడుతూ భారత్‌తో నాకు మంచి అనుబంధం ఉంది. ఇక్కడి నుంచే నైపుణ్యమున్న గ్రాడ్యుయేట్లను మైక్రోసాఫ్ట్‌లో నియమించుకున్నాం. వారిని సియాటెల్ తీసుకెళ్లాం. తర్వాత వారు మళ్లీ భారత్‌కు వచ్చి డెవలప్మెంట్ సెంటర్‌ను నెలకొల్పారు. ప్రస్తుతం ఇవి నాలుగు ప్రదేశాల్లో ఉన్నాయి. ఇందులో 25 వేల మంది విధులు నిర్వర్తిసున్నారు. మైక్రోసాఫ్ట్ విజయంలో భాగమైన చాలామంది అద్భుతమైన వ్యక్తులు భారత్ నుంచి వచ్చినవారే అని అన్నారు.






