America :ఆ యువకుడిదే తప్పు.. అక్రమంగా ఆ దేశంలోకి
అమెరికాలోని నెవార్క్ విమానాశ్రయంలో ఒక భారతీయ యువకుడితో అక్కడి భద్రతాధికారులు ప్రవర్తించిన తీరుపై భారత విదేశీ వ్యవహారాల శాఖ ( ఎంఈఎ) తాజాగా స్పందించింది. ఆ యువకుడు తప్పు చేశాడని, అక్రమంగా అమెరికా (America)కు వెళ్లినట్లు ఎంఈఏ వర్గాలు వెల్లడిరచాయి. ప్రయాణ సమయంలో ఆ యువకుడి ప్రవర్తన సరిగా లేదు. హరియాణా (Haryana)కు చెందిన అతడు సరైన వీసా (Visa) లేకుండా అక్రమంగా అమెరికాలోకి ప్రవేశించి తప్పు చేశాడు. ప్రస్తుతం అతడు పోలీసుల (Police) అదుపులో ఉన్నాడు. వైద్య సదుపాయాలు అందుతున్నాయి. అతడి ఆరోగ్య పరిస్థితి మెరుగైన తర్వాత భారత్ (India)కు పంపించే ఏర్పాట్లు జరుగుతాయి. దీనికి సంబంధించి అక్కడి అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నాం అని ఎంఈఏ అధికారులు పేర్కొన్నారు.







