Pakistan : మునీర్ మిమ్మల్ని తప్పుదారి పట్టించాడు
పాకిస్థాన్‌లోని సహజ వనరులపై జరుగుతున్న వాదనలను బలూచ్ నాయకుడు మీర్ యార్ బలూచ్ (Mir Yar Baloch) తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ ప్రాంతంలో ఉన్న విస్తారమైన చమురు, ఖనిజ నిల్వలు వాస్తవానికి పాకిస్థాన్‌ను కాదని, రిపబ్లిక్ ఆఫ్ బలూచిస్తాన్ (Republic of Balochistan) కు చెందినవని ఆయన తెలిపారు. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) , అమెరికా ప్రభుత్వాన్ని పాకిస్థాన్ సైన్యం, ముఖ్యంగా ఆర్మీ చీఫ్ జనరల్ అసిమ్ మునీర్ (Asim Munir) పూర్తిగా తప్పుదారి పట్టించారని మీర్ యార్ బలూచ్ వెల్లడిరచారు. పాకిస్థాన్ ఉగ్రవాదానికి ఆశ్రయం కల్పించే దేశంగా అయన అభివర్ణించారు.







