విద్యార్థులకు ఆస్ట్రేలియా షాక్ … భారీగా పెంచిన
ఆస్ట్రేలియా ప్రభుత్వం అంతర్జాతీయ విద్యార్థుల వీసా ఫీజును భారీగా పెంచిందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. రాజ్యసభలో విదేశీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి కీర్తి వర్ధన్ సింగ్ ఒక ప్రశ్నకు ఈ మేరకు లిఖిత పూర్వకంగా సమాధానమిచ్చారు. ప్రస్తుతం 710 ఆస్ట్రేలియా డాలర్లు ( సుమారు రూ.39 వేలు)గా ఉన్న వీసా ఫీజును ఏకంగా 1,600 డాలర్ల (రూ.88 వేల) కు పెంచిందని, వచ్చే ఏడాది జులై ఒకటో తేదీ నుంచి అమలు కానుందని మంత్రి తెలిపారు. ఈ చర్య భారత్ సహా ఇతర దేశాల విద్యార్థులకు పెనుభారంగా మారనుందన్నారు. ఈ నేపథ్యంలో వీసా ఫీజు పెంపును పున: పరిశీలించాలంటూ ఆస్ట్రేలియా అధికారులను కోరామని ఆయన వివరించారు.






