Indians Injured: ఆయిల్ ట్యాంకర్‌పై దాడి,, నలుగురు భారతీయులకు గాయాలు!
పశ్చిమాసియాలో (మిడిల్ ఈస్ట్) అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ దేశాల మధ్య నెలకొన్న తీవ్ర యుద్ధ వాతావరణం నడుమ మరో సంచలన ఘటన చోటుచేసుకుంది. ఒమన్ తీరంలో ఇంధనం రవాణా చేస్తున్న ఒక భారీ ఆయిల్ ట్యాంకర్‌పై ఆకస్మిక దాడి జరిగింది. ఈ నౌకలో ప్రయాణిస్తున్న సిబ్బందిలో అత్యధికులు భారతీయులే (Indians Injured) కావడం తీవ్ర ఆందోళన రేకెత్తిస్తోంది.
‘స్కైలైట్’ నౌక టార్గెట్‌గా దాడి..
పలావు (Palau) దేశపు రిజిస్ట్రేషన్‌తో ప్రయాణిస్తున్న ‘స్కైలైట్‘ (Skylight) అనే ఆయిల్ ట్యాంకర్ లక్ష్యంగా ఈ దాడి జరిగినట్లు అధికారులు వెల్లడించారు. ఈ వాణిజ్య నౌక ఒమన్ సముద్ర జలాల్లోని ముసండమ్ (Musandam) తీరం సమీపంలో ఉండగా గుర్తుతెలియని వ్యక్తులు దీనిపై దాడికి పాల్పడ్డారు.
ఇవి కూడా చదవండి
నలుగురు భారతీయులకు గాయాలు..
ఈ ఆయిల్ ట్యాంకర్లో మొత్తం 20 మంది సిబ్బంది (క్రూ) విధులు నిర్వర్తిస్తున్నారు. వారిలో 15 మంది భారతీయులు కాగా, మిగిలిన ఐదుగురు ఇరాన్ జాతీయులు. నౌకపై జరిగిన ఈ దాడిలో నలుగురు భారతీయ నావికులకు (Indians Injured) గాయాలయ్యాయి. దాడి జరిగిన వెంటనే అప్రమత్తమైన అధికారులు, సహాయక చర్యలు చేపట్టి మొత్తం 20 మంది సిబ్బందిని రక్షించి సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ప్రస్తుతం వారి ప్రాణాలకు ఎలాంటి ముప్పు లేదని సమాచారం.

(adsbygoogle = window.adsbygoogle || []).push({});
అమెరికా ఆంక్షలున్న నౌకపైనే దాడి..
వాణిజ్య నౌకల రాకపోకలు అత్యంత రద్దీగా ఉండే ఒమన్ సముద్ర జలాల సమీపంలో ఇలాంటి దాడి జరగడం బహుశా ఇదే తొలిసారి అని అధికారిక వర్గాలు చెబుతున్నాయి. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, దాడికి గురైన ‘స్కైలైట్’ ఆయిల్ ట్యాంకర్‌పై ఇప్పటికే అమెరికా ఆంక్షలు అమలులో ఉన్నట్లు తెలుస్తోంది. ఇజ్రాయెల్-ఇరాన్ ఉద్రిక్తతలు పతాక స్థాయికి చేరిన ప్రస్తుత తరుణంలో, అమెరికా ఆంక్షలు ఉన్న నౌకపైనే దాడి (Indians Injured) జరగడం వెనుక ఉన్న కారణాలపై దర్యాప్తు కొనసాగుతోంది.
ఇవి కూడా చదవండి

















