Tornadoes: అమెరికాలో టోర్నడోల బీభత్సం
అమెరికాలో పెను తుపాను, టోర్నడోలు (Tornadoes) బీభత్సం సృష్టిస్తున్నాయి. బలమైన గాలుల కారణంగా ఇళ్ల పైకప్పులు, పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాల భవనాలు కూలిపోయాయి. పెద్ద ట్రక్కులు సైతం బోల్తా పడ్డాయి. ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా పలు రాష్ట్రాల్లో ఇప్పటివరకు 35 మంది ప్రాణాలు కోల్పోగా పలువురు గాయపడ్డారు. దుమ్మూధూళితో కూడిన గాలుల కారణంగా కాన్సస్ లో 50 పైగా వాహనాలు డీకొన్నాయి. ఈ ఘటనల్లో 8 మంది మృత్యువాతపడినట్లు పోలీసులు తెలిపారు. తుపాను ప్రభావంతో మిస్సోరీ (Missouri)లోని బేకర్స్ ఫీల్డ్ ప్రాంతంలో 12 మంది, మిసిసిపిలో ఆరుగురు మృతి చెందారు. టెక్సాస్ (Texas) లోని అమరిల్లోలో చోటుచేసుకున్న కారు ప్రమాదాల్లో ముగ్గురి మరణించారు. ఆర్కాన్సాస్ (Arkansas) రాష్ట్రంలో మరో ముగ్గురు చనిపోగా, 29 మంది గాయపడ్డారు. అలబామలో ముగ్గురు మృత్యువాతపడ్డారు. గాలుల కారణంగా ఓహ్లహామాలో 300 ఇళ్లు ధ్వంసమయ్యాయి. అటవీ ప్రాంతాల్లో 130కి పైగా కార్చిచ్చుటు చెలరేగాయి.






