Got Talent : బ్రిటన్ గాట్ టాలెంట్ షోలో రన్నరప్‌గా అస్సాం బాలిక
అస్సాంలోని కార్బీ జిల్లాలో ఓ కుగ్రామంలో జన్మించిన 9 ఏళ్ల బినీతా ఛెత్రీ (Binita Chetry) అనే బాలిక విశ్వ వేదికపై సత్తా చాటింది. బ్రిటన్ (Britain) గాట్ టాలెంట్ (Got Talent) షో లో పోటీపడిన ఆ చిన్నారి తన నృత్వంతో అబ్బురపరిచి రెండో రన్నరప్‌గా నిలిచింది. బ్రహ్మపుత్ర (Brahmaputra) నుంచి థేమ్స్ వరకు తన నృత్యంతో ప్రేక్షకులను మంత్రముగ్దుల్ని చేసింది. తన ప్రదర్శనతో అందరిని గర్వించేలా చేసింది అని ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ (Himanta Biswa Sarma) ఈ సందర్భంగా బాలికకు శుభాకాంక్షలు తెలియజేశారు.







