ఆసియాన్, అమెరికా సమావేశం వాయిదా…

అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్, ఆసియాన్ దేశాల విదేశాంగ మంత్రుల మధ్య జరగాల్సిన వీడియో సమావేశం సాంకేతిక కారణాల రీత్యా జరగలేదని ఆసియాన్ వర్గాలు తెలిపాయి. బ్లింకెన్‍తో తొలి సమావేశం జరగాల్సి ఉంది. ఇందుకోసం పది ఆసియన్ దేశాల విదేశాంగ మంత్రులు సిద్ధమయ్యారు. బ్లింకెన్ ప్రయాణిస్తున్న విమానంలో కమ్యూనికేషన్ వ్యవస్థలో లోపం రావడంతో ఇరు పక్షాలు సమావేశం నిర్వహించలేకపోయాయని ఆ వర్గాలు తెలిపాయి. మళ్లీ సమావేశమయ్యేందుకు కొత్త తేదీని ఇంకా నిర్ధారించలేదు. కోవిడ్‍పై యుఎస్ ఆసియాన్ సంబంధాలు, ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపై ఇరు పక్షాలు చర్చలు జరుపుతామని భావించినట్లు జుకార్తా పోస్ట్ పేర్కొంది.