న్యూ అర్లిన్స్లో మరోసారి కలకలం
అమెరికాలోని లూసియానా రాష్ట్రంలో మరోసారి కాల్పులు కలకలం సృస్టించాయి. న్యూ అర్లిన్స్ నగరంలో రెండు వేర్వేరు ప్రాంతాల్లో ఈ ఘటనలు చోటుచేసుకున్నాయి. ఈ కాల్పుల్లో ఇద్దరు వ్యక్తులు మృతి చెందగా, 10 మంది గాయపడ్డారు. దీనికి సంబంధించి ఎవరినీ అరెస్టు చేయలేదు. నగరంలోని సెయింట్రోచ్ పరిసరాల్లో మధ్యాహ్నం 3:30 గంటలకు మొదటి సారి కాల్పులు జరగ్గా 9 మంది గాయపడ్డారు. 45 నిమిషాల తరువాత రెండో ఘటన ఆల్మోనాస్టర్ ఎవెన్యూ బ్రిడ్జి వద్ద జరిగింది. ఒకరు అక్కడికక్కడే మృతిచెందగా, మరొకరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. మరొకరు గాయపడ్డారు అని పోలీసులు తెలిపారు.






