Canada: కెనడాలో భారతీయ విద్యార్థిని అనుమానాస్పద మృతి
కెనడాలో ఓ భారతీయ విద్యార్థిని అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. అదృశ్యమైన మూడు రోజుల తర్వాత విగతజీవిగా కనిపించింది. మృతురాలిని పంజాబ్ (Punjab) కు చెందిన వంశిక సైనీ (Vansika Saini) (21)గా గుర్తించారు. ఆమె తండ్రి ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) పార్టీ బ్లాక్ నేత దేవిందర్ సైనీ (Devinder Saini) . వంశిక మృతి కెనాలోని భారత హైకమిషన్ నిర్ధారించింది. తన కుమార్తె మృతదేహాన్ని భారత్ (India) కు తీసుకువచ్చేందుకు సాయం చేయాలని దేవిందర్ కేంద్రాన్ని అభ్యర్థించారు. వంశిక రెండేళ్ల క్రితం పైచదువులకోసం కెనడాకు వెళ్లారు. ఏప్రిల్ 25, శుక్రవారం రాత్రి అద్దె ఇంటికి వెతికేందుకు బయటకు వెళ్లిన ఆమె తిరిగిరాలేదు. 11:40 గంటల సమయంలో ఆమె ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది. మరుసటి రోజు జరిగిన పరీక్షకూ ఆమె గైర్హాజరయ్యారు. అక్కడి సన్నిహితులు స్థానిక పోలీసు (Police) లకు ఫిర్యాదు చేయగా వారు విచారణ ప్రారంభించారు. ఈ క్రమంలో ఆమె మృతదేహం ఓ బీచ్లో లభ్యమైంది. మృతికి గల కారణాలు తెలియరాలేదు. దీనిపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు అధికారులు వెల్లడిరచారు.







