Riyadh: రియాద్‌లో ఘనంగా మినీ మహానాడు
సౌదీ అరేబియా రాజధాని రియాద్ (Riyadh) లో మినీ మహానాడు (Mini Mahanadu) ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కేకు కోసి సంబరాలు చేసుకున్నారు. స్థానిక టీడీపీ నాయకులు షేక్ జానీబాషా (Janibasha), చెన్నుపాటి రాజశేఖర్ (Rajasekhar) ల ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు. టీడీపీ ఎన్నారై గల్ఫ్ విభాగం అధ్యక్షుడు రావి రాధాకృష్ణ (Radhakrishna) ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. రియాద్‌లో తొలిసారి మినీ మహానాడు నిర్వహించాం. తిరుమల శ్రీవారి దర్శనంలో ప్రవాసీయులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంది అని పేర్కొన్నారు. టీడీపీ ఎన్నారై సౌదీ అరేబియా అధ్యక్షుడు ఖలీద్ సైపుల్లా మాట్లాడుతూ స్థానిక చట్టాన్ని గౌరవిస్తూ గల్ఫ్ దేశాల్లో టీడీపీని విస్తరిస్తున్నాం. విజయవాడ, విశాఖపట్నం నుంచి రియాద్‌కు నేరుగా విమాన సర్వీసులు నడపాలి. ఉపాధి కోసం గల్ఫ్‌కు వచ్చేవారికి నైపుణ్య శిక్షణ ఇప్పించాలి. గల్ఫ్ దేశాల్లో భారత మహిళలకు సహాయం చేసే కేంద్రాల్లో తెలుగు వచ్చిన వారిని కోఆర్డినేటర్లు గా నియమించాలి అని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. ఐదేళ్ల జగన్ పాలనలో రాష్ట్రం సర్వనాశనమైందని పలువురు విమర్శించారు.







