America: అమెరికాలో గ్లోబల్ జూనీకార్స్ సమిట్
గ్రామీణ ప్రాంత విద్యార్థులను ఆవిష్కర్తలుగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్న ఇంటర్నేషనల్ స్టార్టప్ ఫౌండేషన్ ( ఐఎస్ఎఫ్) 50 మంది గ్రామీణ విద్యార్థులు, మెంటార్లను తమ ఖర్చులతో అమెరికా (America) పర్యటనకు తీసుకెళ్లింది. అక్కడి టెక్సస్ స్టేట్ యూనివర్సిటీ (Texas State University) లో ఈ నెల 29న జరగనున్న గ్లోబల్ జూనీకార్న్ సమిట్ (Global Junior Corn Summit), 30న జరగనున్న గ్లోబల్ ఏఐ సమిట్ (Global AI Summit ) లలో వారు భారత్కు ప్రాతినిధ్యం వహించనున్నారు. వీరిలో ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) , తెలంగాణ(Telangana), ఒడిశా, కర్ణాటకలకు చెందిన వారున్నారు. మొత్తం 1000 మంది విద్యార్థులు ఈ కార్యక్రమాల్లో పాల్గొనడానికి పోటీపడగా ఆరు నెలల పాటు జాతీయస్థాయిలో వివిధ పరీక్షలు నిర్వహించి ఈ 50 మందిని ఎంపిక చేశారు. వీరంతా బెంగళూరులోని కెంపేగౌడ్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బయలుదేరి అమెరికా వెళ్లారు.







