కువైట్ లో ఘరో అగ్ని ప్రమాదం.. 49 మంది సజీవదహనం
కువైట్ లో ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. మంగాఫ్ నగరంలో కార్మికులు నివాసం ఉంటున్న ఓ అపార్ట్మెంట్లో మంటలు ఎగసిపడ్డాయి. ఈ ఘనలో 49 మంది సజీవదహనం అయ్యారు. మృతుల్లో 40 మంది భారతీయులు ఉన్నట్లు తెలిసింది. బుధవారం తెల్లవారుజామున కార్మికులు నివాసం ఉంటున్న అపార్ట్మెంట్లో ఒక్కసారిగా భారీ ఎత్తున మంటలు చెలరేగాయి. అవి క్షణాల్లో పై అంతస్తు వరకూ వ్యాపించాయి. దాంతో అపార్ట్మెంట్ పరిసరాలను దట్టమైన పొగ కమ్ముకుంది. దీంతో నివాసితులు బయటకు వచ్చేందుకు కష్టతరమైంది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని తెలిసింది. అగ్నిప్రమాదం సభవించిన భవనంలో 160 మంది కార్మికులు నివాసం ఉంటున్నారు. ఘటన అనంతరం చాలా మందిని రక్షించాం. కానీ దురదృష్టవశాత్తూ మంటల ధాటికి పొగపీల్చడం వల్ల చాలామంది మరణించారు అని సీనియర్ పోలీస్ కమాండర్ ఒకరు తెలిపారు. సుమారు 50 మందిని ఆసుపత్రికి తరలించినట్లు పేర్కొన్నారు. ప్రమాద కారణాలపై దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. కువైట్ హోంశాఖ మంత్రి షేక్ ఫహద్ అల్ యూసుఫ్ ఘటనాస్థలాన్ని సందర్శించి మృతుల సంఖ్యను ధృవీకరించారు. భవనం యజమానిని, ఈ ప్రమాదానికి కారణమైన వారిని అరెస్టు చేయాలని ఆదేశించారు.






