America: హూతీలపై విరుచుకుపడ్డ అమెరికా
యెమెన్‌లోని హూతీలపై అమెరికా (America) భీకరస్థాయిలో విరుచుకుపడింది. శనివారం రాత్రి నుంచి ఆదివారం ఉదయం వరకు అగ్రరాజ్య వైమానికదళం చేసిన దాడుల్లో 31 మంది మృతి (Death) చెందారు. 101 మందికి గాయాలయ్యాయి. రాజధాని సనా సహా పలు నగరాలపై అమెరికా యుద్ధ విమానాలు బాంబుల వర్షం కురిపించాయి. ఎర్ర సముద్రంలో నౌకలపై దాడులు ఆపేదాకా హూతీ (Houthi)లపై తీవ్రస్థాయిలో విరుచుకుపడతామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) స్పష్టంగా పేర్కొన్న సంగతి తెలిసిందే. ప్రపంచ జలమార్గాల్లో అమెరికా వాణిజ్య, నౌకాదళ నౌకలను ఏ ఉగ్రవాద దళమూ ఆపలేదు అని ఆయన తెలిపారు. హూతీలు మాత్రం తాము తగ్గేదే లేదంటున్నారు. గాజా (Gaza) కు అండగా ఉంటాం. ఎలాంటి సవాళ్లు ఎదురైనా పాలస్తీనియన్లకు సాయం చేయడమైతే ఆపం అని తెలిపారు.






