కరోనా వైరస్ కొత్త ఉమ్మి పరీక్ష కు అత్యవసర అనుమతి:FDA
అగ్ర రాజ్యం లో కరోనా వైరస్ ను కట్టడి చేయడానికి లక్షణం లేని చాలామందితో సహా రోజుకి నాలుగు మిలియన్ల మంది అమెరికన్ ప్రజలకు కరోనా వైరస్ పరీక్షలు నిర్వహించాల్సి ఉంటుంది అని ప్రజారోగ్య అధికారులు నెలల తరబడి విజ్ఞప్తి చేస్తుండగా, ప్రజారోగ్య అధికారులు నివేదించిన రోజువారీ పరీక్షల సంఖ్య ఆగస్టులో చాలా వరకు మందగిస్తున్న సమయం లో మరియు చాలా రాష్ట్రాల్లో పరీక్ష కొరత విస్తృతంగా ఉన్న సమయంలో , జాతీయ ఆరోగ్య పర్యవేక్షణ ప్రయత్నాలకు భంగం కలుగకుండా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ కరోనా వైరస్ను గుర్తించడానికి కొత్త లాలాజల ఆధారిత పరీక్ష కు అత్యవసర అనుమతి మంజూరు చేసినట్లు న్యూ యార్క్ టైమ్స్ తెలిపింది.
N.B.A మరియు నేషనల్ బాస్కెట్బాల్ ప్లేయర్స్ అసోసియేషన్ నుండి వచ్చే కొంత నిధులతో కొత్త లాలాజల ఆధారిత కరోనా వైరస్ పరీక్షను పరిశోధకులు అభివృద్ధి చేసినట్లు మరియు లక్షణరహిత N.B.A ఆటగాళ్ళు మరియు సిబ్బంది పై ఈ పరీక్ష నిర్వహించి సత్ఫలితాలు పొందిన తర్వాత లాలాజల ఆధారిత కరోనా వైరస్ పరీక్ష మరింత ధృవీకరించబడినది అని యేల్ విశ్వవిద్యాలయం శనివారం 15 ఆగస్టు న ప్రకటించినట్లు తెలిసింది. యేల్ విశ్వవిద్యాలయం విడుదల చేసిన ప్రకటన ప్రకారం, ఖరీదైన పరీక్ష గొట్టాల అవసరాన్ని తొలగించడం ద్వారా ఖర్చులను తగ్గించుకునే మార్గాలను అన్వేషిస్తూ, సరసతను దృష్టిలో పెట్టుకుని కొత్త కరోనా వైరస్ పరీక్షను అభివృద్ధి చేశారని పరిశోధకులు తెలిపినట్లు మరియు కరోనా వైరస్ పరీక్షా కేంద్రాలు ఒక నమూనాకు సుమారు $ 10 ఖర్చుతో పరీక్షను నిర్వహించగలరు అని పరిశోధకులు భావిస్తున్నట్లు మరియు ఇటీవలి పరీక్ష మందగమనాన్ని ఎదుర్కోవడంలో సహాయపడే మరొక పరీక్షకు ఇది దోహదపడుతుందని పరిశోధకులు తెలిపినట్లు న్యూ యార్క్ టైమ్స్ పేర్కొంది.






