అగ్రరాజ్యంలో లక్షా 70 వేలు దాటిన కరోనా మరణాలు
కరోనా కాటుకు అగ్రరాజ్యం విలవిలాడుతోంది. నిత్యం 5 వేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదవుతుండగా వందల్లో మరణాలు సంభవిస్తుండడంతో ఇంటి నుంచి కాలు బయటపెట్టాలంటే అమెరికన్లు వణికిపోతున్నారు. ఇప్పటివరకు అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో 5.4 మిలియన్ల మంది కరోనా మహమ్మారి బారినపడగా తీవ్రమైన ఇన్ఫెక్షన్ కారణంగా 1.7 లక్షల మంది మృత్యువాత పడ్డారని ప్రఖ్యాత జాన్ హోప్కిన్స్ యూనివర్సిటీ తన నివేదికలో వెల్లడించింది. ప్రపంచ వ్యాప్తంగానూ కరోనా కల్లోలం ఏ మాత్రం తగ్గడం లేదు. ఇప్పటివరకు 21.5 మిలియన్ల మంది వైరస్ బారినపడగా 7.73 లక్షల మంది చనిపోయారని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది.






