మంత్రి హరీష్‌రావుకి కరోనా…
తెలంగాణ వ్యాప్తంగా అంతకంతకూ పెరుగుతూనే ఉన్న కరోనా మహమ్మారి ప్రముఖులనూ వదలడం లేదు. తాజాగా తెలంగాణ రాష్ట్ర మంత్రి హరీష్‌రావుకు సైతం కరోనా సోకింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా శనివారం ప్రకటించారు. వైద్య పరీక్షల్లో తనకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయిందని, అయితే ఎటువంటి ఆందోళన అవసరం లేదని తాను ఆరోగ్యంగానే ఉన్నానని తెలిపారు. తనతో కొన్ని రోజులుగా సన్నిహితంగా మెలిగిన ప్రతి ఒక్కరూ ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. ప్రస్తుతం హరీష్‌రావు హోమ్ ఐసోలేషన్‌లో ఉన్నారు.
గెట్వెల్ సూన్ బావా…
మంత్రి హరీష్‌రావుకి కరోనా సోకిన విషయం తెలిసిన కెటియార్ స్పందించారు. తన బావగారు త్వరలోనే కోలుకోవాలని ఆకాంక్షిస్తూ గెట్ వెల్ సూన్ బావా అంటూ ట్వీట్ చేశారు.






