30 నిమిషాల్లో ఫలితం … అమెరికా
కరోనా ఉందో లేదో కేవలం 30 నిమిషాల్లో తేల్చే పోర్టబుల్ మెషీన్ ప్రొటోటైప్‌ను అమెరికా శాస్త్రవేత్తలు తయారు చేశారు. రిజల్ట్ కూడా మొబైల్‌కు మెసేజ్ వచ్చేలా, సంబంధిత అధికారులకు కూడా సమాచారం వెళ్లేలా తయారు చేసినట్లు వారు తెలిపారు. ఈ పరిశోధకుల సమూహంలో ఓ భారతీయ మూలాలున్న శాస్త్రవేత్త కూడా ఉండటం గమనార్హం. ఇలాంటి పరికరాల వల్ల కోవిడ్ నిర్ధారణ సులవవుతుందని బయో ఇంజినీరింగ్ ప్రొఫెసర్ రషీద్ బాషిర్ తెలిపారు. నిర్ధారణ కోసం గొంతు నుంచి తీసిన ద్రవాన్ని ఇందులో ఉపయోగించనున్నారు. ఆర్టీ-పీసీఆర్‌తో పొల్చదగ్గ ఫలితాలు ఈ ల్యాంప్ పరికరం ద్వారా వచ్చినట్లు వెల్లడించారు. గొంతు నుంచి కాకుండా, లాలాజలం నుంచి నిర్ధారణ పరీక్ష చేసే ప్రయత్నాలు సాగుతున్నట్లు చెప్పారు.






