ఏపీలో మరో ఎమ్మెల్యేకు కరోనా
ఆంధప్రదేశ్ రాష్ట్రంలోని తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం శాసనసభ్యుడు పెండెం దొరబాబుకు కరోనా పాజిటివ్ వచ్చినట్లు పిఠాపురం ప్రభుత్వ ఆస్పత్రి వైద్యాధికారి విజయ్ శేఖర్ తెలిపారు. అనారోగ్యంతో ఉండడంతో ఎమ్మెల్యే స్థానిక సామాజిక ఆరోగ్య కేంద్రంలో కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకున్నారు. ఈ పరీక్షల్లో ఆయనకు పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు వైద్యాధికారి తెలిపారు. దీంతో చికిత్స నిమిత్తం కాకినాడలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేశారు. ఇటీవల తనను కలిసిన నాయకులు, ప్రభుత్వ అధికారులు ఎవరైనా ఉంటే వెంటనే కొవిడ్ పరీక్షలు చేయించుకోవాలని ఎమ్మెల్యే సూచించారు.






