ఆ నాలుగు రాష్ట్రాల వారికి నో ఎంట్రీ
దేశంలో మహారాష్ట్ర, కేరళ, గుజరాత్, తమిళనాడు రాష్ట్రాల్లో కరోనా మహమ్మారి తీవ్రస్థాయిలో విజృంభిస్తున్నది. ఇతర రాష్ట్రాల్లో కొంతమేర పరిస్థితులు మెరుగుపడుతున్నప్పటికీ ఈ నాలుగు రాష్ట్రాల్లో మాత్రం పరిస్థితులు మరింత ఆందోళనకరంగా మారుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ నాలుగు రాష్ట్రాల నుంచి తమ రాష్ట్రంలోకి ఎవరూ రావద్దని కర్నాటక ముఖ్యమంత్రి యడియూరప్ప కోరారు. కేరళలో కరోనా వైరస్ ఎఫెక్ట్ తగ్గినప్పటికీ ఆ రాష్ట్రం నుంచి కూడా ఎవ్వరినీ అనుమతించమని తెలిపింది. కరోనా వ్యాప్తి నివారణకే ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపింది. కేంద్రం ప్రకటించిన గైడ్ లైన్స్ తప్పకుండా పాటిస్తామని కర్ణాటక సీఎం యడ్యూరప్ప తెలిపారు.






