ప్రపంచంలో మనమే టాప్… అమెరికా సైతం వెనక్కు
ప్రపంచంలోనే అత్యధికంగా కొవిడ్ 19 రికవరీలతో భారత్ అగ్రస్థానంలో నిలిచింది. రికవరీల్లో అమెరికాను అధిగమించినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. మొత్తం రికవరీ కేసుల సంఖ్య 42 లక్షలు దాటిందని వెల్లడించింది. వైరస్ను గుర్తించేందుకు ప్రభుత్వం సకాలంలో తీసుకుంటున్న సమర్థవంతమైన చర్యలవల్లే ఇది సాధ్యపడిందని తెలిపింది. గత 24 గంటల్లో 93,337 కొత్త కేసులు, 1,247 మరణాలు సంభవించాయని మంత్రిత్వ శాఖ ప్రకటించింది. దీంతో దేశంలో కొవిడ్ కేసుల సంఖ్య 53 లక్షలను దాటిందని తెలిపింది. ప్రస్తుతం దేశంలో 10,13,964 యాక్టివ్ కేసులు ఉండగా, 42,08,432 మంది కొవిడ్ నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయినట్లు వివరించింది. మహమ్మారి వల్ల ఇప్పటివరకూ 85,619 మంది చనిపోయినట్లు తెలిపింది. ఇక అమెరికాలో ఇప్పటి వరకు 67,23,933 కరోనా కేసులు నిర్ధారణ అయ్యాయి. వీరిలో 36,89,081 మంది కోలుకుని ఇళ్లకు చేరారు. మరో 1,98,570 మంది మృత్యువాతపడ్డారు.






