24 గంటల్లో 97,894 కరోనా పాజిటివ్ కేసులు
దేశంలో కరోనా వైరస్ విజృంభిస్తూనే ఉన్నది. కొత్తగా నమోదు అవుతున్న పాజిటివ్ కేసుల సంఖ్య రోజు రోజుకూ పెరుగుతున్నది. గత 24 గంటల్లో దేశంలో కొత్తగా 97,894 మందికి వైరస్ సంక్రమించింది. దీంతో దేశవ్యాప్తంగా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 51 లక్షల మైలురాయిని దాటింది. గత 24 గంటల్లో వైరస్ వల్ల దేశంలో మరణించిన వారి సంఖ్య 1132గా ఉన్నది. దేశవ్యాప్తంగా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 51,18,254గా నమోదు అయ్యింది. దేశంలో మొత్తం 10,09,976 యాక్టివ్ కేసులు ఉన్నాయి. సుమారు 40,25,080 మంది వైరస్ నుంచి కోలుకున్నారు. మొత్తం మరణాల సంఖ్య 83,198కి చేరుకున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.సెప్టెంబర్ 16వ తేదీన దేశవ్యాప్తంగా 11,36,613 శ్యాంపిళ్లను పరీక్షించినట్లు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసర్చ్ పేర్కొన్నది. దీంతో మొత్తం పరీక్షలు నిర్వహించిన సంఖ్య ఆరు కోట్లు దాటింది.






