కరోనా కట్టడికి రెండు ఔషధాలు
మానవ కణాల్లో కరోనా వైరస్ వృద్ధి చెందకుండే నిరోధించగలిగే రెండు ఔషధాలను గుర్తించినట్లు అమెరికాలోని హార్వర్డ్ మెడికల్ స్కూల్ శాస్త్రవేత్తలు ప్రకటించారు. వ్యాకోలిన్-1, యాపిలిమోడ్ అనే ఔషధాలు శరీరంలోని పీఐకేఫైవ్ కినేజ్ అనే ఎంజైమ్ కార్యకలాపాలకు అడ్డుకోవడం ద్వారా కణాల్లోకి చొరబడిన కొవిడ్ వైరస్ వృద్ధిని నిలువరిస్తాయని వెల్లడించారు. ఫలితంగా కరోనా ఇన్ఫెక్షన్ వేగంగా వ్యాపించకుండా, తీవ్రత మరింత పెరగకుండా చేయవచ్చన్నారు. కాగా, వ్యాకోలిన్-1 ఔషధాన్ని 16 ఏళ్ల క్రితం కనుగొన్న శాస్త్రవేత్త థామస్ కిర్చ్హాజెన్ కూడా ఈ అధ్యయనంలో కీలక భూమిక పోషించడం విశేషం.






