వైరస్ ను నిర్మూలించే గ్రాఫీన్ మాస్క్
సర్జికల్ మాస్క్‌లకు యాంటీబ్యాక్టీరియల్ లక్షణాలు లేనందున బ్యాక్టీరియాను నిరోధించ గలిగే గ్రాఫిన్ మాస్క్‌లను హాంకాంగ్ సిటీ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు రూపొందించ గలిగారు. సర్జికల్ మాస్క్‌లపై గంటల తరబడి హానికారక బ్యాక్టీరియా తిష్టవేసి ప్రమాదం ఉంది. గ్రాఫిన్ అనే పదార్ధానికి యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఉన్నాయని శాస్త్రవేత్తలు సృష్టం చేశారు. ఈ మాస్క్‌లను , వేగంగా తక్కువ ధరతో తయారు చేయగల వినూత్న విధానాన్ని అభివృద్ధి చేశారు. కార్బన్ డై ఆక్సైడ్ ఇన్ఫ్రారెడ్ లేజర్ వ్యవస్థను పాలిమైడ్ పొరలపై ప్రసరింప చేయడం ద్వారా త్రీడి గ్రాఫీన్‌ను తయారు చేయవచ్చని నిరూపణ అయింది.






