డొనాల్డ్ ట్రంప్ క్యాంపేన్ మేనేజరుకు కరోనా
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ క్యాంపేన్ మేనేజరు బిల్ స్టిపియన్ కు కరోనా పాజిటివ్ అని తేలింది. 42 ఏళ్ల ట్రంప్ పొలిటికల్ మీడియా మేనేజరు స్టిపియన్ ఫ్లూ లక్షణాలు కనిపించడంతో, కోలుకునే వరకూ అతను వర్క్ ఫ్రం హోం చేస్తారని ట్రంప్ వర్గాలు తెలిపాయి. గురువారం రాత్రి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఆయన సతీమని మెలానియా ట్రంప్ లు కొవిడ్ 19న బారిన పడ్డారు. కరోనా సోకిన స్టిపియన్ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ క్లీవ్ లాండ్ పర్యటనలో వెంట పాల్గొన్నారు. కరోనా సోకిన హోం హిక్స్ తో స్టిపియన్ కలిసి పనిచేశారు.






