ప్రపంచానికి చైనా తొలి ప్రదర్శన
ప్రపంచమంతా ఎప్పుడెపుడా అని ఎదురుచూస్తున్న కరోనా వ్యాక్సిన్‌ను తొలుత తామే అభివృద్ధి చేశామని రష్యా ప్రకటిస్తే, వైరస్‌కు పుట్టిల్లయిన చైనా ఏకంగా తమ దేశంలో తయారైన వ్యాక్సిన్లను ప్రదర్శనకు పెట్టింది. చైనా ఫార్మా దిగ్గజాలు సినోవ్యాక్ బయోటెక్, సినోఫామ్ అభివృద్ధి చేసిన టీకాలను చైనా ఇంటర్నేషనల్ ఫెయిర్ ఫర్ ట్రేడ్ ఇన్ సర్వీసెస్‌లో ప్రదర్శనకు పెట్టింది. వాటిని మార్కెట్లో విక్రయించడానికి ఆ కంపెనీలకు ఇంకా అనుమతి లభించలేదు. మూడో దశ ట్రయల్స్ పూర్తి చేసి ఈ ఏడాది చివరికల్లా అనుమతులు తెచ్చుకోవడానికి కృషి చేస్తున్నారు.






