మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావుకు కరోనా పాజిటివ్
ఆంధప్రదేశ్ రాష్ట్ర దేవదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు కరోనా బారిన పడ్డారు. తిరుమలలో ఈ నెల 19న నుంచి ఆరంభమైన శ్రీవారి బ్రహ్మోత్సవాలకు ఆయన వెళ్లారు. వారం రోజులపాటు అక్కడే ఉన్నారు. 23న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించేందుకు వెళ్లినపుడు మంత్రి వెలంపల్లి ఆయనను కలిశారు. ముఖ్యమంత్రికి స్వాగతం పలికినప్పటి నుంచి ఆయన తిరిగి వెళ్లేవరకు పలు సందర్భాల్లో ఆయన వెంటే ఉన్నారు. మంత్రి వెలంపల్లి తిరిగి ఈ నెల 25వ తేదీన విజయవాడకు చేరుకున్నారు. అప్పటి నుంచి స్వల్పంగా కొవిడ్ లక్షణాలు కనిపించడంతో పరీక్ష చేయించుకోగా పాజిటివ్ అని తేలింది. దీంతో మంత్రి ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరినట్లు తెలిసింది.






