అమెజాన్‌లో20 వేల మందికి కరోనా…
తమ సంస్థలో మార్చి నుండి ఇప్పటి వరకు సుమారు 20 వేల మంది ఉద్యోగులు కరోనా బారిన పడ్డారని ఈ- కామర్స్ దిగ్గజ సంస్థ అమెజాన్ పేర్కొంది. అమెజాన్‌లో పదమూడు లక్షల మంది ఫ్రంట్‌లైన్ వర్కర్లు (అమెరికాలో ఫుడ్ మార్కెట్ గ్రోసరీ స్టోర్స్‌లో పనిచేస్తున్న వారితో సహా) పనిచేస్తుండగా.. ఊహించినదాని కంటే తక్కువ మందే కరోనా బారిన పడ్డారని తెలిపింది. కరోనా సమయంలో తమ రక్షణకు సంబంధించిన భద్రతా ప్రమాణాలతోపాటు కరోనా బారిన పడిన సహచరుల పట్ల సమచారాన్ని వెల్లడించేందుకు సంస్థ ఇష్టపడటం లేదని పేర్కొంటూ అమెజాన్ ఉద్యోగులు కొందరు విమర్శలు చేయడంతో కపెంనీ ఈ వివరాలు వెల్లడించాల్సి వచ్చింది. మొత్తం 19,800 మంది కరోనా బారిన పడ్డారని చెప్పింది. కరోనా పరీక్షలను 650 పని ప్రాంతాల్లో రోజుకు 50 వేల పెంచుతున్నట్లు తెలిపింది.






