TTA: టీటీఏ మెగా కన్వెన్షన్లో కంటిన్యూయింగ్ మెడికల్ ఎడ్యుకేషన్ సదస్సు
తెలంగాణ అమెరికా తెలుగు సంఘం (TTA) ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న మెగా కన్వెన్షన్ 2026లో భాగంగా ప్రత్యేకంగా కంటిన్యూయింగ్ మెడికల్ ఎడ్యుకేషన్ (CME) సదస్సును ఏర్పాటు చేస్తున్నారు. ఈ కార్యక్రమం నార్త్ కరోలినాలోని షార్లెట్ కన్వెన్షన్ సెంటర్లో జూలై 18 19 తేదీల్లో జరగనుంది. ఈ సదస్సుకు ఏఐజీ హాస్పిటల్స్ వ్యవస్థాపకులు పద్మవిభూషణ్ అవార్డు గ్రహీత డాక్టర్ దువ్వూరు నాగేశ్వర్ రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి కీలక ప్రసంగం చేయనున్నారు.
వైద్య రంగంలోని నిపుణులు విద్యార్థుల కోసం ఏర్పాటు చేసిన ఈ సదస్సులో గుండె వైఫల్యం (CHF) నిర్వహణ, క్యాన్సర్ చికిత్సలో రోగనిరోధక వ్యవస్థ పాత్ర మెనోపాజ్ వంటి కీలక అంశాలపై చర్చలు జరుగుతాయి. ఈ సదస్సులో పాల్గొనడం ద్వారా వైద్యులు ‘AMA PRA Category 1’ క్రెడిట్లను పొందే అవకాశం ఉంది. రిజిస్ట్రేషన్ ఫీజు వివరాలు ఇతర సమాచారం కోసం టీటీఏ ప్రతినిధులు డాక్టర్ సంతోష్ దేవరపల్లి లేదా డాక్టర్ నందిని సుంకిరెడ్డిని సంప్రదించవచ్చు. వైద్య విద్యార్థులకు ఈ సదస్సులో ప్రవేశం ఉచితంగా కల్పించబడింది.






