TANA: తానా చార్లెట్ టీం ఆధ్వర్యంలో సీపీఆర్, ఏఈడీ శిక్షణా కార్యక్రమం
ఉత్తర అమెరికా తెలుగు సంఘం (TANA) చార్లెట్ టీం, శ్రీ సాయి గురుదేవ్ దత్త మందిర్ మరియు HEARTSafe Workplace సంస్థలతో కలిసి అత్యవసర ప్రాణ రక్షణ విద్య అయిన CPR & AED శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమం ద్వారా పాల్గొనే వారికి సర్టిఫికేషన్ కూడా అందిస్తారు.
ముఖ్య వివరాలు:
తేదీ: మార్చి 7, శనివారం.
సమయం: మధ్యాహ్నం 1:00 నుండి సాయంత్రం 5:00 గంటల వరకు.
వేదిక: 1793 Cabarrus Ave W, Concord, NC 28027.
రిజిస్ట్రేషన్ ఫీజు: 10 డాలర్లు.
ముఖ్య గమనిక:
సర్టిఫికేషన్ నిబంధనల ప్రకారం ముందస్తు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మాత్రమే అనుమతి ఉంటుంది, నేరుగా వచ్చే వారికి (Walk-ins) అవకాశం లేదు. ఆసక్తి ఉన్నవారు వెంటనే https://forms.gle/BHrvMGNuV7UzVg919 లింక్ ద్వారా తమ పేర్లను నమోదు చేసుకోవాలని నిర్వాహకులు కోరారు. మరిన్ని వివరాలకు హెల్త్ సర్వీసెస్ కోఆర్డినేటర్ మాధురి ఏలూరి (980-322-5177) ని సంప్రదించవచ్చు.






