వైభవంగా టిఎజిడివి ఉగాది వేడుకలు
తెలుగు అసోసియేషన్ ఆఫ్ గ్రేటర్ డెలావేర్ వ్యాలీ (టిఎజిడివి) ఆధ్వర్యంలో ‘శ్రీ పరాభవ’ నామ సంవత్సర ఉగాది వేడుకలు మే 2, 2026న డౌనింగ్‌టౌన్ హైస్కూల్ ఈస్ట్‌లో అత్యంత వైభవంగా నిర్వహించారు. సంస్థ యొక్క 53 ఏళ్ల సుదీర్ఘ చరిత్రలో వెయ్యి మందికి పైగా హాజరైన ఈ వేడుక అత్యంత చిరస్మరణీయమైనదిగా నిలిచింది. మధ్యాహ్నం నుండి రాత్రి వరకు సుమారు ఆరు గంటల పాటు నిర్విరామంగా సాగిన ఈ ఉత్సవాల్లో శాస్త్రీయ, జానపద మరియు సినీ నృత్యాలు ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశాయి. ‘తార ఆర్ట్స్ అకాడమీ’ వారి ప్రత్యేక ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది.
సుప్రసిద్ధ గాయకులు శ్రీకాంత్ సండుగు, మనీషా ఈరబత్తినీల ‘బెఫికర’ బ్యాండ్ మ్యూజికల్ షో ప్రేక్షకులలో నూతనోత్సాహాన్ని నింపింది. ఈ కార్యక్రమానికి సాహితీ వింజమూరి, శ్వేత కొమ్మోజీ వ్యాఖ్యాతలుగా వ్యవహరించారు. ఉచిత ప్రవేశం మరియు రుచికరమైన విందు భోజనం టిఎజిడివి సేవా నిరతికి అద్దం పట్టింది. ప్రముఖ ఆస్కార్ అవార్డు గ్రహీత, గీత రచయిత శ్రీ చంద్రబోస్ ఈ వేడుకకు ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన తన ఆస్కార్ ప్రయాణంలోని మధుర జ్ఞాపకాలను, వ్యక్తిగత అనుభవాలను పంచుకున్నారు. ప్రేక్షకుల కోరిక మేరకు ఆయన ఆలపించిన గీతాలు మరియు ముఖాముఖి కార్యక్రమం వేడుకలకే హైలైట్‌గా నిలిచింది.
ఈ కార్యక్రమానికి సహ-నిర్వాహకులుగా వ్యవహరించిన ‘మన అమెరికన్ తెలుగు అసోసియేషన్ ’ (మాటా)కు టిఎజిడివి ధన్యవాదాలు తెలిపింది. జూన్ 19-20 తేదీల్లో ఫిలడెల్ఫియాలో జరగనున్న ‘మాటా’ రెండో జాతీయ మహాసభలకు శుభాకాంక్షలు తెలియజేసింది.
ఇవి కూడా చదవండి
ఈ ఉత్సవంలోనే నూతన కార్యవర్గాన్ని (2026-28) అధికారికంగా ప్రకటించారు:
అధ్యక్షుడు: హరీష్ అన్నబత్తిన
ఉపాధ్యక్షుడు: సురేష్ బొండుగుల
కార్యదర్శి: శివ అనంతూని
కోశాధికారి: మధు బూదటి
జాయింట్ సెక్రటరీ: లావ కుమార్ ఇనంపూడి
జాయింట్ ట్రెజరర్: స్వాతి కొండేటి
మాజీ అధ్యక్షుడు తులసి రామ్మోహనరావు తల్లూరి తన పదవీ కాలంలో సహకరించిన కార్యవర్గ సభ్యులకు, వాలంటీర్లకు ధన్యవాదాలు తెలుపుతూ, నూతన కార్యవర్గానికి బాధ్యతలు అప్పగించారు.

కార్యక్రమ విజయవంతానికి కృషి చేసిన దాతలు మరియు స్పాన్సర్లకు నిర్వాహకులు కృతజ్ఞతలు తెలియజేశారు.
ప్లాటినం స్పాన్సర్: రామ్మోహనరావు-విజయ తల్లూరి,
గోల్డ్ స్పాన్సర్స్: హరినాథ్-రాధిక బుంగటవుల, శివ-విజయ అనంతూని, సురేష్-లావణ్య బొండుగుల, వ్యోమ్., సిల్వర్ స్పాన్సర్స్: బావర్చి ఇండియన్ కుజిన్, హరీష్-శ్రావణి
ప్లాటినం స్పాన్సర్: రామ్మోహనరావు-విజయ తల్లూరి,
గోల్డ్ స్పాన్సర్స్: హరినాథ్-రాధిక బుంగటవుల, శివ-విజయ అనంతూని, సురేష్-లావణ్య బొండుగుల, వ్యోమ్.,
సిల్వర్ స్పాన్సర్స్: బావర్చి ఇండియన్ కుజిన్, హరీష్-స్రవంతి.
బ్రాంజ్ స్పాన్సర్స్: ముజీబుర్ రెహమాన్ – కరుణ, నాయుడు – ప్రమీల మోటుపల్లి, ఎల్ ఎస్ ప్రాపర్టీ ఇన్వెస్ట్మెంట్స్, తానా, నాట్స్ వ్యవహరించారు.
ఇతర దాతలు మరియు మద్దతుదారులుగా సుధాకర్ పావులూరి, సురేష్ యలమర్తి, లవ్‌కుమార్ ఇనంపూడి, కృష్ణ నందుమూరి, భాస్కర్ మక్కెన, కవిత కురుకొండ, సునీత సిద్ధపురెడ్డి, గౌరీ కారోతు, నీలవేణి కందుకూరి, దాము గేదెల, సరోజ సాగరం, హరినాథ్ దొడ్డపనేని, రాజు వెగేశ్న, విక్రమ్ ఆర్జుల, రవి వీరవల్లి, రాజు కాకర్ల, కిరణ్ కొత్తపల్లి, మదన్ గారు, మల్లిక్ బుధవరపు, సురేష్ వెన్నకంటిగిరి, సత్య వర్మ గారు, మాధవ రెడ్డి మోసర్ల, బాబు మేడి, జే తల్లూరి మరియు వెంకట్ సాకమూరి ఉన్నారు.
టిఎజిడివి యువజన కమిటీ సభ్యులు ఉత్సాహంగా పాల్గొని, సేవా కార్యక్రమాల కోసం నిధుల సేకరణకు స్నాక్ స్టాల్‌ను నిర్వహించారు. వారి నాయకత్వ పటిమను సభ అభినందించింది. యుక్త బుంగటవుల, ఆదిత్య అనంతూని, అమృత సాకమూరి, నిహారిక ఇనంపూడి, అద్వైత్ బొండుగుల, క్రిషిత నందమూరి, తనిష్క కారోతు, స్తుతి రాకోతు, పరధ కారోతు, సహస్ర చావలి, శ్రియ గొర్రెపాటి, సాహితి మంద, ప్రణతి జమ్మలమడక, గ్రీష్మ గున్ను, శ్రీవిద్య రెడ్డి కర్రా ఈ వేడుకల నిర్వహణలో పాలుపంచుకున్నారు.
రిజిస్ట్రేషన్, ఆతిథ్యం, భోజన వసతి మరియు స్టేజ్ నిర్వహణలో సుమారు 40 మందికి పైగా వాలంటీర్లు అహర్నిశలు శ్రమించారు. వారిలో బాబు మేడి, ప్రశాంత్ పసుపుల, రవి ఇంద్రగంటి, సంజయ్ దుడాల, నూతన్ బాతుల, కిరణ్ పోకూరి, మాధవి సముద్రాల, సుదర్శన్ విన్నకోట తదితరులు ఉన్నారు. మల్లిక్ బుధవరపు పంచాంగ పఠనం చేయగా, ఆదినారాయణ మూర్తి నూతనపాటి (ఎవి), విశ్వనాథ్ కోగంటి (ఫోటోగ్రఫీ), ఆది గుప్తా (డెకరేషన్) తమ సేవలందించారు. టిఎజిడివి యూత్ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్నాక్ స్టాల్ విశేష స్పందన పొందింది. సుమారు 50 మందికి పైగా వాలంటీర్లు అంకితభావంతో పనిచేసి ఈ ఉగాది ఉత్సవాలను విజయవంతం చేశారు.
ఇవి కూడా చదవండి






