ప్రవాసులకు యోనో ద్వారా ఖాతా : ఎస్బీఐ
మొబైల్ యాప్ యోనో ద్వారా ప్రవాస భారతీయులు (ఎన్నారైలు), ఎన్ఆర్ఈ, ఎన్ఆర్ఓ ఖాతాల (పొదుపు, కరెంటు ఖాతాలు) ను సులువుగా తెరిచే సదుపాయాన్ని స్టేట్ బ్యాంక్ ఇఫ్ ఇండియా (ఎస్బీఐ) అందుబాటులోకి తీసుకొచ్చింది. ముఖ్యంగా బ్యాంకు కొత్త ఖాతాదార్ల కోసం ఈ సదుపాయాన్ని రూపొందించామని, దీని ద్వారా ఖాతా తెరిచే ప్రక్రియ మరింత సులువుగా, వేగవంతంగా ఉంటుందని ఎస్బీఐ ఒక ప్రకటనలో తెలిపింది. భారత్లో ఖాతా తెరవడం, నిర్వహణ సులువుగా ఉండాలంటూ చాన్నాళ్లుగా ఎన్నారై వినియోగదార్ల నుంచి వస్తున్న డిమాండుకు కూడా దీని ద్వారా పరిష్కారం చూపినట్లు అవుతుందని పేర్కొంది.
ఎన్ఆర్ఈ (నాన్ రెసిడెన్షియల్ ఎక్స్టర్నల్) ఖాతా అంటే విదేశాల్లో ఆర్జించిన డబ్బులను జమ చేసేందుకు ఎన్నారైలు భారత్ లోని బ్యాంకుల్లో తెరిచే ఖాతా. అద్దెలు, డివిడెండు, వడ్డీ తదితరలా రూపంలో భారత్లో ఆర్జించిన ఆదాయాన్ని జమ చేసేందుకు భారత్లో తెరిచే ఖాతాను ఎన్ఆర్ఓ (నాన్ రెసిడెంట్ ఆర్డినరీ) ఖాతాగా వ్యవహరిస్తారు.






