టెస్లా సీఎఫ్ఓగా భారత సంతతి వ్యక్తి
టెస్లా కొత్త చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ (సీఎఫ్ఓ)గా భారత సంతతికి చెందిన వైభవ్ తనేజా నియమితులయ్యారు. సీఎఫ్ఓ జాచరీ కిర్కాన్ వైదొలగుతున్నట్లు ప్రకటించిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు టెస్లా పేర్కొంది. అమెరికాకు చెందిన ఈ విద్యుత్ కార్ల దిగ్గజ కంపెనీలోనే ప్రస్తుతం చీఫ్ అకౌంటింగ్ ఆఫీసర్(సీఏఓ)గా పనిచేస్తున్న తనేజా(45) అదనంగా సీఎఫ్ఓ బాధ్యతలనూ నిర్వర్తిస్తారు. 2016 మార్చిలో టెస్లాలో చేరిన తనేజా వివిధ హోదాల్లో పనిచేశారు. 2019 మార్చిలో సీఏఓగా మారారు. ఎలాన్ మస్క్‌కు చెందిన ఈ కంపెనీలో కిర్కాన్ 13 ఏళ్లుగా పనిచేస్తున్నారు.






