మే 15 తో ముగియనున్న ‘హ్యూస్టన్ ఐడల్’ ఎర్లీ బర్డ్ రిజిస్ట్రేషన్లు
TCA: హ్యూస్టన్ తెలుగు సాంస్కృతిక సమితి (TCA) తన 50 వసంతాల స్వర్ణోత్సవ వేడుకల (Golden Jubilee) సందర్భంగా ప్రతిష్టాత్మకమైన “హ్యూస్టన్ ఐడల్ 2026″ పోటీలను నిర్వహిస్తోంది. ఈ పోటీలకు సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రస్తుతం వేగంగా కొనసాగుతోంది.
ఇవి కూడా చదవండి
గడువు , ఫీజు వివరాలు..
- ఎర్లీ బర్డ్ ఆఫర్: మే 15, 2026 లోపు రిజిస్టర్ చేసుకున్న వారికి ఒక్కో పార్టిసిపెంట్‌కు కేవలం $25 మాత్రమే.
- సాధారణ రిజిస్ట్రేషన్: మే 15 తర్వాత రిజిస్ట్రేషన్ ఫీజు $50 ఉంటుంది.
- చివరి గడువు: దరఖాస్తు చేసుకోవడానికి జూన్ 5, 2026 ఆఖరి తేదీ.
పోటీల వివరాలు..
సింగింగ్ (సోలో), డ్యాన్స్ (సోలో , గ్రూప్) విభాగాల్లో పోటీలు ఉంటాయి. ఇందులో సబ్ జూనియర్స్ (8-13 ఏళ్లు), జూనియర్స్ (14-19 ఏళ్లు), సీనియర్స్ (20 ఏళ్లు పైబడిన వారు) పాల్గొనవచ్చు. ఈ పోటీల్లో విజేతలుగా నిలిచిన వారికి ఆగస్టు 8, 2026న ఫోర్ట్ బెండ్ ఎపిసెంటర్లో జరగనున్న స్వర్ణోత్సవ వేడుకల ప్రధాన వేదికపై లైవ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చే అవకాశం లభిస్తుంది.
రిజిస్ట్రేషన్ వివరాలు..
ఆసక్తి గల అభ్యర్థులు www.tca50.org వెబ్సైట్ ద్వారా లేదా పోస్టర్‌లోని క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేసి రిజిస్ట్రేషన్ పూర్తి చేయవచ్చు.
మరిన్ని వివరాల కోసం cultural@tca50.org కు ఈమెయిల్ చేయాలని లేదా టీసీఏ అధ్యక్షులు యాదగిరి రెడ్డి కుడుముల, కన్వీనర్ జితేందర్ రెడ్డి, కల్చరల్ చైర్ స్నేహ రెడ్డి చిర్రలను సంప్రదించాలని కోరారు. హ్యూస్టన్ పరిసర ప్రాంతాల్లోని తెలుగు వారు ఈ సువర్ణావకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని టీసీఏ కార్యవర్గం విజ్ఞప్తి చేసింది.
ఇవి కూడా చదవండి






