సివిఎస్ లో లేఆఫ్స్… 5వేల మందికి ఉద్వాసన
అమెరికాకు చెందిన ప్రముఖ రిటైల్ ఫార్మా, హెల్త్ కేర్ సొల్యూషన్స్ కంపెనీ సివిఎస్ హెల్త్ కార్పొరేషన్ తన ఉద్యోగులకు బ్యాడ్ న్యూస్ చెప్పింది. మొత్తం వర్క్ ఫోర్స్ లో 5 వేల మందికి ఉద్వాసన పలకనున్నట్లు వెల్లడించింది. తద్వారా ఖర్చులు తగ్గించుకుంటూ, ఆరోగ్య సంరక్షణ సేవల పై ఎక్కువగా ఫోకస్ పెట్టాలని చూస్తోంది. హోమ్ కేర్ ప్రొవైడర్ సిగ్నిపై హెల్త్, ప్రైమరీ`కేర్ కంపెనీ ఒక స్ట్రీట్ హెల్త్‌ను సివిఎస్ ఇటీవల అక్వైర్ చేసింది. తద్వారా తన రిటైల్ బిజినెస్ నుంచి హెల్త్ కేర్ దిశగా మరింత విస్తరించడంపై దృష్టి సారించింది. ఇందులో భాగంగా ఇప్పుడు ఉద్యోగాల కోత విధించింది. తమ క్లినికల్ ట్రయల్స్ యూనిట్‌ను కూడా వచ్చే ఏడాది చివరి నాటికి పూర్తిగా మూసివేయనున్నట్లు మేలోనే ప్రకటించింది.






