అంకురాలు, విద్యార్థులకు బోయింగ్ ఆహ్వానం
భారత్లోని విశ్వవిద్యాలయ విద్యార్థులు, ప్రారంభ దశ అంకురాలు బోయింగ్ ఇన్నోవేషన్ లీడర్షిప్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ (బిల్డ్)కు దరఖాస్తు చేసుకోవచ్చని అమెరికా విమానయాన సంస్థ బోయింగ్ ఆహ్వానం పలికింది. యువ ఔత్సాహిక పారిశ్రామికవేత్తల వినూత్న ఆలోచనలను బిల్డ్ ప్రోత్సహిస్తుంది. కొత్త మార్కెట్ అవకాశాలను సృష్టిస్తుందని కంపెనీ పేర్కొంది. విమానయాన, రక్షణ సాంకేతికత. సోషల్ ఇంపాక్ట్, సస్టెయినబిలిటీ వంటి రంగాల్లో నవంబరు 10లోగా దరఖాస్తులు చేసుకోవచ్చని అందులో తెలిపింది. ఈ ప్రోగ్రామ్ కోసం టీ`హబ్ హైదరాబాద్ సహా దేశంలోని ఏడు ఇంక్యుబేటర్లతో భాగస్వామ్యం కుదుర్చుకున్నట్లు బోయింగ్ వివరించింది.






