బాల్టిమోర్ ‘ఆటా’ మహాసభల సన్నాహాలు ముమ్మరం
ATA: అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ATA) ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న బాల్టిమోర్ మహాసభల కోసం సన్నాహక కార్యక్రమాలు ఊపందుకున్నాయి. గడిచిన వారాంతంలో కాన్ఫరెన్స్ టీమ్ సభ్యులు స్థానికంగా పలు ప్రజా సంబంధాల కార్యక్రమాల్లో పాల్గొని, మహాసభల విశిష్టతను చాటిచెప్పారు.

ఇవి కూడా చదవండి
ఆధ్యాత్మిక కార్యక్రమాలు..
సుమారు 1,000 మందికి పైగా హాజరైన స్థానిక GWTCS వేడుకలో ఆటా ప్రతినిధులు పాల్గొని, రాబోయే కాన్ఫరెన్స్ గురించి వివరించారు. అలాగే, స్థానిక శివ విష్ణు ఆలయాన్ని సందర్శించి, ఆలయ బోర్డు సభ్యులతో సమావేశమయ్యారు. మహాసభల్లో నిర్వహించబోయే ఆధ్యాత్మిక కార్యక్రమాలకు వారి సహకారాన్ని కోరారు. ‘స్టైల్ అండ్ షైన్’ ఈవెంట్లో పాల్గొని, పలువురు వెండర్లను (Vendors) మహాసభల భాగస్వామ్యం కోసం ఆహ్వానించారు.
మాతృ దినోత్సవ వేడుకలు ఘనంగా..
సుమారు 100 మంది ప్రతినిధులతో నిర్వహించిన 5 గంటల సుదీర్ఘ సమావేశంలో మహాసభల పురోగతిని సమీక్షించారు. ఇందులో కల్చరల్, ఫుడ్, గోల్ఫ్ టోర్నమెంట్, మ్యాట్రిమోనీ, యూత్, ఉమెన్, పొలిటికల్ వంటి వివిధ కమిటీల ప్రతినిధులు పాల్గొన్నారు. ప్రతి కమిటీ సాధించిన పురోగతిని సమీక్షించి, తదుపరి కార్యాచరణను ఖరారు చేశారు. ఇదే వేదికపై మాతృ దినోత్సవ వేడుకలను కూడా ఘనంగా నిర్వహించారు.

వచ్చే వారం డెలావేర్లో జరగనున్న బోర్డు సమావేశంలో ప్రతి కమిటీ తమ పూర్తి స్థాయి నివేదికలను సమర్పించనుంది. ఈ మహాసభలకు హాజరుకాబోయే వారు అధికారిక వెబ్ సైట్ (https://ataconference.org) లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని నిర్వాహకులు కోరారు.






