ATA: గ్లోబల్ ఎడ్యుకేషన్ లో కొత్త అధ్యాయం.. ఐఐటీ విద్యార్థుల కోసం ఆటా ఇంటర్న్షిప్స్!
ATA: విద్యా రంగంలో సరికొత్త విప్లవానికి అమెరికా తెలుగు సంఘం (ఆటా) శ్రీకారం చుట్టింది. భారతదేశంలోని అగ్రశ్రేణి విద్యాసంస్థ అయిన ఐఐటీ హైదరాబాద్ (IITH) తో కలిసి విద్యార్థుల వికాసం కోసం ఒక కీలక ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఈ భాగస్వామ్యం ద్వారా అటు అమెరికాలోని తెలుగు విద్యార్థులకు, ఇటు ఐఐటీ విద్యార్థులకు అంతర్జాతీయ స్థాయిలో విద్యా , పరిశోధన అవకాశాలు లభించనున్నాయి.
స్టూడెంట్ ఎక్స్ఛేంజ్ ప్రోగ్రామ్: అమెరికాలోని విద్యార్థులు ఐఐటీ హైదరాబాద్‌లో సమ్మర్ కోర్సులు, ఏఐ (AI), కంప్యూటర్ సైన్స్ వంటి సబ్జెక్టుల్లో శిక్షణ పొందే అవకాశం.
పరిశోధనలు: ఐఐటీలోని 1.5 లక్షల చదరపు అడుగుల ఇన్నోవేషన్ పార్క్‌లో రీసెర్చ్ ప్రాజెక్టులు చేసే వీలు.
స్టార్టప్ అభివృద్ధి: 320కి పైగా స్టార్టప్స్‌లో పెట్టుబడులు , మెంటార్షిప్ కోసం పారిశ్రామికవేత్తలకు ఆహ్వానం.
ఇవి కూడా చదవండి
ఆటా ఎడ్యుకేషన్ కమిటీ (ATA Education Committee):
ఈ ప్రాజెక్టును సమర్థవంతంగా నిర్వహించడానికి కింది బృందం బాధ్యత వహిస్తోంది:
- చైర్: సుశీల్ చందా
- కో-చైర్లు: రవి లోతుమల్ల, సతీష్ యెల్లమిల్లి
- సభ్యులు: ఫణీంద్ర రెడ్డి కాసు, నరేష్ తుల్లూరు, శైలేందర్ వూట్ల, కల్యాణ్ కొండి.
ఆటా కార్యవర్గ కమిటీ (Executive Committee):
ఈ ఒప్పందానికి పూర్తి మద్దతుగా నిలిచిన ఆటా నాయకత్వం:
- ప్రెసిడెంట్: జయంత్ చల్లా
- ప్రెసిడెంట్ ఎలెక్ట్: సతీష్ రామసహాయం రెడ్డి
- పాస్ట్ ప్రెసిడెంట్: మధు బొమ్మినేని
- సెక్రటరీ: సాయినాథ్ బోయపల్లి
- ట్రెజరర్: శ్రీకాంత్ గుడిపాటి
- జాయింట్ సెక్రటరీ: శారద సింగిరెడ్డి
- జాయింట్ ట్రెజరర్: విజయ్ రెడ్డి తుపాళ్ళి
- ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్: నర్సిరెడ్డి గడ్డికొప్పుల
- ఎగ్జిక్యూటివ్ అడ్వైజర్: అరవింద్ రెడ్డి ముప్పిడి.
ఆసక్తి గల విద్యార్థులు తమ వివరాలను నమోదు చేసుకోవడానికి https://tinyurl.com/ATA-IITH-SEP లింక్‌ను ఉపయోగించవచ్చు.






