అమెరికా లాటరీలో రూ.13 వేల కోట్ల జాక్ పాట్!
అదృష్టం అంటే ఇదే మరి. అమెరికాలో ఫ్లోరిడా మెగా మిలియన్స్ లాటరీలో ఓ వ్యక్తి 1.58 బిలియన్ డాలర్ల (రూ.13 వేల కోట్లు) జాక్‌పాట్ కొట్టాడు. విజేత వివరాలు తెలియలేదు. నెఫ్యూన్ బీచ్‌లోని పబ్లిక్ స్టోర్ విక్రేత ఈ టికెన్‌ను విక్రయించారు. లాటరీ నిర్వాహకులు డ్రా తీశారు. 13,1,4,19, 20, 32, 33 నంబరు టికెట్‌కు జాక్‌పాట్ దక్కినట్లు ప్రకటించారు. అమెరికా చరిత్రలో మూడో అతిపెద్ద లాటరీ ప్రైజ్‌మనీ ఇదేనని అక్కడి మీడియా వర్గాలు వెల్లడించాయి. డ్రాలో గెలుపొందిన వ్యక్తికి రూ.1.58 బిలియన్ డాలర్ల నగదును ఏడాదికి కొంత మొత్తం చొప్పున 30 ఏళ్ల పాటు చెల్లిస్తారు. అలా కాకుండా ఒకేసారి ఈ మొత్తాన్ని పొందాలంటే అతనికి సుమారు 783.3 మిలియన్ డాలర్లు మాత్రమే వస్తాయి.






