Ram Charan: చరణ్ చేతికి ఏమైంది?

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(ram charan) కు ఉన్న ఫాలోయింగ్ గురించి కొత్తగా చెప్పనక్కర్లేదు. ప్రస్తుతం పెద్ది సినిమా చేస్తున్న రామ్ చరణ్ నిన్న తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన డ్రగ్స్ అవేర్‌నెస్ ప్రోగ్రామ్ కు హాజరై తన మాటలతో అందరినీ ఆకట్టుకున్నాడు. విజయ్ దేవరకొండ(Vijay Dearakonda)తో కలిసి ఈ ఈవెంట్ లో పాల్గొన్న చరణ్ డ్రగ్స్ వాడకానికి వ్యతిరేకంగా మాట్లాడాడు.
డ్రగ్స్ దుర్వినియోగం విషయంలో అందరూ దానికి వ్యతిరేకంగా సైనికుల్లా పోరాడాలని బలమైన మెసేజ్ ఇచ్చాడు రామ్ చరణ్. అయితే ఈ కార్యక్రమానికి చరణ్ తన చేతికి బ్యాండేజ్ తో వచ్చిన విషయాన్ని అతని స్పీచ్ లో భాగంగా ఫ్యాన్స్ గుర్తించి దానికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ అసలు చరణ్ చేతికేమైంది? బ్యాండేజ్ ఎందుకు వేసుకున్నాడని ట్వీట్లు వేస్తున్నారు.
మరికొందరు చరణ్ కు సినిమా షూటింగ్ లో గాయమై ఉండొచ్చని భావిస్తున్నారు. ప్రస్తుతం రామ్ చరణ్ బుచ్చిబాబు సాన(Buchi babu sana) దర్శకత్వంలో పెద్ది(Peddhi) అనే పాన్ ఇండియా సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో జాన్వీ కపూర్(Janhvi kapoor) హీరోయిన్ గా నటిస్తుండగా, చరణ్ కు ఈ సినిమా షూటింగ్ లోనే గాయమై ఉంటుందని ఫ్యాన్స్ అనుకుంటున్నారు. అయితే గాయానికి సంబంధించి ఇప్పటివరకు ఎలాంటి అనౌన్స్‌మెంట్ ఇవ్వలేదంటే ఆ గాయం తీవ్రత అంత ఎక్కువ అయుండదని అనుకుంటున్నారు. ఏదేమైనా చరణ్ గాయం గురించి చెప్పకపోయినా ఫ్యాన్స్ దాన్ని గుర్తించి ఆ విషయంలో కంగారు పడటం ఫ్యాన్స్ కు అతనిపై ఉన్న అభిమానాన్ని స్పష్టం చేస్తుంది.