Minister Dola: ఊహించినదానికంటే ఎక్కువగా పెట్టుబడులు : మంత్రి డోలా
విశాఖ సీఐఐ సదస్సు (CII Conference)కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి (Veeranjaneyaswamy) తెలిపారు. మాట్లాడుతూ గత 5 ఏళ్ళ వైసీపీ (YCP) అరాచక పాలనతో రాష్ట్రం తీవ్రంగా నష్టపోయిందన్నారు. కూటమి పాలనతో రాష్ట్ర అభివృద్ధిలో నూతన అధ్యాయం మొదలైందని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) విజనరీ నాయకత్వంపై నమ్మకంతో రాష్ట్రానికి పరిశ్రమలు, పెట్టుబడులు వస్తున్నాయని చెప్పారు. ఊహించినదానికంటే ఎక్కువగా పెట్టుబడులు వస్తున్నాయన్నారు.
రాష్ట్ర యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించాలన్న లక్ష్యంతో చంద్రబాబు, మంత్రి లోకేష్ అహర్నిశలు శ్రమిస్తున్నారని తెలిపారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన 17 నెలల్లోనే చంద్రబాబు, లోకేష్ కృషితో ఇప్పటి వరకు రూ.9.5 లక్షల కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చాయని అన్నారు. చంద్రబాబు, ప్రభుత్వం పట్ల ప్రజల్లో, పెట్టుబడిదారుల్లో ఒక నమ్మకం, విశ్వాసం కలిగించారన్నారు. రాష్ట్ర యువతకు 20 లక్షల ఉద్యోగాలు కల్పించాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. గూగుల్ సంస్థ దేశంలోనే తొలిసారి డేటా సెంటర్ విశాఖలో ఏర్పాటు చేస్తున్నారంటే ఇది రాష్ట్రానికి గర్వకారణమని అన్నారు. లోకేష్ శ్రమకు ఫలితంగా, విశాఖలో గూగుల్ 15 బిలియన్ డాలర్ల (రూ.1.33 లక్షల కోట్లు) పెట్టుబడులు పెట్టబోతోందన్నారు. రాష్ట్రానికి పెట్టుబడుల సాధనలో మంత్రి లోకేష్ ది కీలక పాత్ర అని వెల్లడించారు.






