Vishwambhara: విశ్వంభర నుంచి ఫ్యాన్స్ కు డబుల్ ట్రీట్?
టాలీవుడ్లో మెగాస్టార్ చిరంజీవి(chiranjeevi) నటిస్తున్న సోషియో ఫాంటసీ మూవీ విశ్వంభర(Vishwambhara)పై ప్రేక్షకుల్లో రోజురోజుకీ ఆసక్తి పెరుగుతోంది. టాలెంటెడ్ డైరెక్టర వశిష్ట(vassishta) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ భారీ ప్రాజెక్ట్ ప్రారంభం నుంచే విజువల్ గ్రాండియర్‌తో ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది. అయితే వీఎఫ్ఎక్స్ పనుల్లో ఎదురైన జాప్యాల కారణంగా సినిమా రిలీజ్ పలుమార్లు వాయిదా పడింది. ఆల్రెడీ షూటింగ్ ను పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ ను జరుపుకుంటుంది. ముఖ్యంగా గ్రాఫిక్స్ వర్క్స్ ను నెక్ట్స్ లెవెల్ లో అందించేందుకు మేకర్స్ రాజీ పడకుండా కృషి చేస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో ఫైనల్ అవుట్‌పుట్‌పై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.
ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ త్వరలోనే ఒక కీలక అప్డేట్ ఇవ్వడానికి సిద్ధమవుతున్నట్లు టాక్ వినిపిస్తోంది. పవర్ఫుల్ ట్రైలర్ రిలీజ్‌తో పాటు కొత్త రిలీజ్ డేట్‌ను ఒకేసారి ప్రకటించేలా ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. వాస్తవానికి ఈ అప్డేట్ను శ్రీ రామ నవమి సందర్భంగా ఇవ్వాలనే ఆలోచన ఉన్నప్పటికీ, అప్పటి ఇతర పెద్ద సినిమాల హడావిడి దృష్ట్యా ఆ నిర్ణయాన్ని వాయిదా వేసినట్లు తెలుస్తోంది. ఇప్పుడు సరైన టైమ్ చూసుకుని ట్రైలర్‌ను రిలీజ్ చేయాలని మేకర్స్ భావిస్తున్నారని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి.
టాలీవుడ్ ప్రెస్టీజియస్ ప్రొడక్షన్ హౌస్ UV క్రియేషన్స్(UV Creations) నిర్మిస్తున్న ఈ సినిమాలో త్రిష కృష్ణన్(Trisha Krishnan) హీరోయిన్ గా నటిస్తుండగా, సంగీతాన్ని ఎం.ఎం కీరవాణి(M. M Keeravani) అందిస్తున్నారు. ట్రైలర్‌కు ఆడియన్స్ నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తే, ఇప్పటికే ఉన్న అంచనాలు మరింత రెట్టింపు కావడం ఖాయం. మెగాస్టార్ ఫ్యాన్స్ అయితే ఈ డబుల్ ట్రీట్ ఎప్పుడు అందుతుందా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఇవి కూడా చదవండి






