UBS: ఉస్తాద్ భగత్‌సింగ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ పై అప్డేట్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(pawan kalyan) హీరోగా తెరకెక్కుతున్న మాస్ ఎంటర్టైనర్ ఉస్తాద్ భగత్ సింగ్(Ustaad Bhagath Singh)పై అభిమానుల్లో ఎప్పటినుంచో భారీ అంచనాలు నెలకొన్నాయి. యంగ్ హీరోయిన్స్ శ్రీలీల(Sree leela), రాశీ ఖన్నా(Raashi khanna) హీరోయిన్లుగా నటిస్తుండగా, ఈ సినిమాను మాస్ సినిమాలకి ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న డైరెక్టర్ హరీష్ శంకర్(Harish Shankar) తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే రిలీజైన పోస్టర్లు, టీజర్‌కు మంచి రెస్పాన్స్ రావడంతో సినిమా పై బజ్ మరింత పెరిగింది. మార్చ్ 26న గ్రాండ్‌గా విడుదలకు సిద్ధమవుతున్న ఈ సినిమా కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ మాస్ అవతార్‌లో కనిపించనున్నాడనే టాక్ ఫ్యాన్స్‌ల్లో మరింత హైప్‌ను క్రియేట్ చేస్తోంది.
ఇక ప్రమోషన్స్‌లో భాగంగా గ్రాండ్ ప్రీరిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించేందుకు మేకర్స్ ప్లాన్ చేసినట్లు తాజా సమాచారం. మార్చ్ 19న ఈ వేడుకను నిర్వహించేందుకు తేదీని ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. సినిమా రిలీజ్‌కు వారం రోజుల ముందు ఈ ఈవెంట్‌ను ప్లాన్ చేయడం ద్వారా అంచనాలను మరింత పెంచాలనే ఆలోచనలో ఉన్నారు. హైదరాబాద్‌లో ఈ కార్యక్రమం జరగనుండగా, ప్రముఖ వేదిక అయిన శిల్ప కళా వేదికలో ఈ ఈవెంట్ ఉండే అవకాశం ఉందని సమాచారం. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
![]()
ఈ సినిమాలో తమిళ నటుడు ఆర్. పార్తిబన్(R. Parthiban) విలన్‌గా కీలక పాత్ర పోషిస్తున్నారు. యాక్షన్, ఎమోషన్, మాస్ ఎలిమెంట్స్ కలగలిపి ప్రేక్షకులను అలరించే విధంగా సినిమా ఉండబోతుందనే టాక్ వినిపిస్తోంది. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్(Mythri Movie Makers) ఈ సినిమాను నిర్మిస్తోంది. భారీ బడ్జెట్‌తో రూపొందిన ఈ ప్రాజెక్ట్ బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టిస్తుందనే నమ్మకంతో ఫ్యాన్స్ ఉన్నారు. ఇప్పుడు అందరి చూపు మార్చ్ 19 ప్రీరిలీజ్ ఈవెంట్‌పైనే నిలిచింది.
ఇవి కూడా చదవండి

















