Squid Game OTT: ఓటీటీల ప్రభావం: స్క్విడ్ గేమ్ 2 సృష్టించిన హంగామా మాములుగా లేదుగా..

ప్రపంచవ్యాప్తంగా ఓటీటీల (OTT) ప్రభావం ఎంత పెరిగిందో చెప్పనవసరం లేదు. ఒకప్పుడు థియేటర్లు సినిమాల ద్వారా ఎంత పేరు తెచ్చుకున్నాయో, ఇప్పుడు ఓటీటీలు అదే స్థాయిలో ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటున్నాయి. ఓటీటీల వల్ల టీవీ ఛానెల్స్ కూడా ప్రభావితమవుతున్నాయి.
ఓటీటీల్లో మంచి వినోదాన్ని అందిస్తూ, ప్రేక్షకుల్ని మంత్రముగ్ధులను చేసే టాప్ ప్లాట్‌ఫామ్‌లలో నెట్‌ఫ్లిక్స్ (Netflix) ముందుంటుంది. ఈ ప్లాట్‌ఫామ్‌లో విడుదలైన ఎన్నో సిరీస్‌లు ప్రపంచవ్యాప్తంగా పేరుగాంచాయి. అందులో “మనీ హేస్ట్” ( money heist) ఒకటి. స్పానిష్ భాషలో వచ్చిన ఈ సిరీస్, ఇంగ్లీష్ డబ్బింగ్‌తో ప్రపంచవ్యాప్తంగా సూపర్ హిట్ అయింది. కానీ ఈ సిరీస్ రికార్డులను కొరియన్ భాషలో వచ్చిన “స్క్విడ్ గేమ్” (Squid Game) సిరీస్ బ్రేక్ చేసి, కొత్త ట్రెండ్‌ను సృష్టించింది.
కరోనా సమయంలో కొరియన్ సినిమాలు, సిరీస్‌లకు చాలా మంచి ఆదరణ లభించింది. “స్క్విడ్ గేమ్” మొదటి సీజన్ కేవలం ఒక్క రోజులోనే రికార్డు స్థాయిలో వ్యూస్ తెచ్చుకుంది. తాజాగా వచ్చిన సీజన్ 2 కూడా అదే స్థాయిలో విజయాన్ని సాధించింది.
సీజన్ 2 విడుదలైన మొదటి ఐదు రోజుల నుంచే 92 దేశాల్లో నెంబర్ 1 స్థానంలో నిలిచింది. నెట్‌ఫ్లిక్స్ తెలిపిన వివరాల ప్రకారం, ఈ సిరీస్ మొదటి వారం రోజుల్లోనే అత్యధిక వ్యూస్‌ను సాధించింది. అంతేకాదు, నాన్-ఇంగ్లీష్ కంటెంట్‌లో అత్యంత ఎక్కువ వ్యూస్ అందుకున్న టాప్ 7 షోల్లో ఒకటిగా నిలిచింది.
ఈ సీజన్ మొత్తం 7 ఎపిసోడ్స్‌తో వచ్చింది. కేవలం ఐదు రోజుల్లోనే 68 మిలియన్లకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకోవడం విశేషం. మొదటి సీజన్ ఎంత పెద్ద హిట్ అయ్యిందో ఇప్పుడు రెండో సీజన్ కూడా ఆ స్థాయిలోనే హంగామా సృష్టించింది. ఇలాంటి విజయాలు ఓటీటీల ప్రాముఖ్యతను మరింతగా పెంచుతున్నాయి. “స్క్విడ్ గేమ్ 2” సాధించిన విజయం ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో భాషతో సంబంధం లేకుండా ప్రేక్షకులు కంటెంట్తో కనెక్ట్ అవుతున్నారు అన్నదానికి నిదర్శనంగా నిలుస్తుంది.