Peddi: పెద్దిలో స్పెషల్ మాస్ సాంగ్

గేమ్ ఛేంజర్(Game changer) తర్వాత గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Ram charan) చేస్తున్న సినిమా భారీ ప్యాన్ ఇండియన్ సినిమా పెద్ది(peddhi). బుచ్చిబాబు సాన(Buchi babu sana) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మాస్ యాక్షన్ థ్రిల్లర్ పై అందరికీ మంచి అంచనాలున్నాయి. ఆ అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా పెద్దిని తెరకెక్కిస్తున్నారు బుచ్చిబాబు. మొన్నా మధ్య రిలీజైన పెద్ది ఫస్ట్ షాట్(Peddhi First Shot) కు ఆడియన్స్ నుంచి విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది.
బాలీవుడ్ జాన్వీ కపూర్(Janhvi Kapoor) హీరోయిన్ గా నటిస్తున్న పెద్ది సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుండగా, రీసెంట్ గానే మేకర్స్ ఓ యాక్షన్ ఎపిసోడ్ ను పూర్తి చేశారు. అయితే ఇప్పుడు పెద్దికి సంబంధించి ఓ కొత్త రూమర్ వినిపిస్తోంది. రంగస్థలం(Rangasthalam) సినిమాలోని ఐటెమ్ సాంగ్ లాంటి ఓ స్పెషల్ సాంగ్ ను మేకర్స్ రీసెంట్ గానే షూట్ చేశారని రూమర్లు వినిపిస్తున్నాయి.
ఈ సాంగ్ మాస్ ఆడియన్స్ తో విజిల్స్ వేయించడం పక్కా అంటున్నారు. కాగా బుచ్చిబాబు ఈ సినిమాను విలేజ్ బ్యాక్ డ్రాప్ లో స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కిస్తున్నారు. పెద్దికి సంబంధించి మరో 40 రోజుల షూటింగే పెండింగ్ ఉందని సమాచారం. వృద్ధి సినిమాస్(Vriddhi Cinemas), సుకుమార్ రైటింగ్స్(Sukumar Writings), మైత్రీ మూవీ మేకర్స్(Mythri Movie Makers) భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్(AR Rahman) సంగీతం అందిస్తున్నారు.