Shriya Saran: లెహంగాలో మెరిసిపోతున్న శ్రియా

తన యాక్టింగ్ తో ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న శ్రియా శరణ్(Shriya Saran) ఫ్యాషన్ రంగంలో తనదైన సత్తా చాటుతూ అదరగొడుతుంది. రీసెంట్ గా శ్రియా శరణ్ కు సంబంధించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్యాస్టెల్ బ్లూ కలర్ లెహంగా లో శ్రియా గ్లామర్ కు కొత్త డెఫినిషన్ ఇచ్చింది. ఈ డ్రెస్ లో శ్రియా తన సన్నని నడుముతో ఎంతో అందంగా ప్రిన్సెస్ లా కనిపిస్తోంది. డ్రెస్ కు తగ్గట్టే చెవులకు జుమ్కాలు, సింపుల్ హెయిర్ స్టైల్ శ్రియాను మరింత అందంగా మార్చాయి. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా ఆమె ఫాలోవర్లు వాటికి లైకుల వర్షం కురిపిస్తున్నారు.