Game Changer: గేమ్ చేంజర్ కు షాకుల మీద షాకులు

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram charan), స్టార్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్ లో వచ్చిన పొలిటికల్ డ్రామా ఫిలిం గేమ్ చేంజర్ (Game Changer) భారీ అంచనాలతో వచ్చి డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. నెగిటివ్ టాక్ రావడంతో అభిమానులు కూడా డీలాపడ్డారు. దీనితో సినిమా కలెక్షన్స్ పరంగా తొలిరోజు అనుకున్నంత స్థాయిలో రాబట్ట లేకపోయింది. గేమ్ చేంజర్ సినిమా మొత్తం 450 కోట్ల బడ్జెట్ తో రాగా తొలిరోజు కేవలం 51 కోట్ల నెట్ కలెక్షన్స్ రాబట్టినట్టు తెలుస్తోంది. గ్రాస్ పరంగా అయితే సుమారు 80 కోట్లు మాత్రమే వసూలు చేసింది ఈ సినిమా.
తెలుగు రాష్ట్రాల్లో కేవలం 42 కోట్లు వసూలు చేయడం షాక్ అనే చెప్పాలి. హిందీ వర్షన్ లో అయితే ఏడు కోట్లు మాత్రమే వచ్చాయి. తమిళంలో రెండు కోట్లు, అలాగే కన్నడలో 10 లక్షలు, మలయాళంలో ఐదు లక్షల వరకు గేమ్స్ చేంజర్ సినిమా రాబట్టింది. దేశవ్యాప్తంగా 17,161 షోలలో 9.39 లక్షల టికెట్లను బుక్ మై షో విక్రయించగా.. కేవలం అడ్వాన్స్ బుకింగ్ లతో ప్రపంచ వ్యాప్తంగా 26.8 కోట్లు సాధించింది ఈ సినిమా. సినిమాలో రామ్ చరణ్ తన నటన విషయంలో నూటికి నూరు శాతం న్యాయం చేస్తే కథలో పట్టు లేకపోవడంతో సినిమా ఫ్లాప్ అయింది.
ఇతర నటీనటులు కూడా సినిమాలో తమ స్థాయికి తగ్గట్టు జాగ్రత్తగా నటించారు. ఇక ఇలాగే కంటిన్యూ అయితే మాత్రం బ్రేక్ ఈవెన్ కావడం కూడా కష్టమే అనే ఒపీనియన్ వినపడుతోంది. ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమాకు మరో షాక్ తగిలింది. గేమ్ చేంజర్ ఉదయం స్పెషల్ షోను రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసింది. ఈ మేరకు తెలంగాణ హోం శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. హైకోర్టు ఆదేశాలతో మార్నింగ్ స్పెషల్ షోనూ రద్దు చేసింది. అటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఇప్పటికే ఈ సినిమాకు గట్టి షాక్ ఇచ్చింది. హైకోర్టు ఉత్తర్వుల మేరకు అర్ధరాత్రి ఒంటిగంట, తెల్లవారుజామున నాలుగు గంటల అదనపు షోలకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి నిరాకరిస్తూ ఉత్తర్వులను సవరించింది.