కృష్ణ పుట్టిన రోజున ‘సర్కారు వారి పాట’ ట్రీట్ ఎలా వుండబోతుందో?

సూపర్ స్టార్ మహేష్ నుంచి కొత్త సినిమా విడుదలయ్యి ఏడాది కావస్తుంది. సరిలేరు నీకెవ్వరు తరువాత మహేష్ చేస్తున్న సినిమా సర్కారు వారి పాట. ప్రస్తుతం మహేష్ తన తదుపరి సినిమా సర్కారు వారి పాట షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. చిత్ర యూనిట్ ఈ సినిమాను ముందుగా ఈ ఏడాదిలోనే విడుదల చేయాలని భావించారు. కానీ సినిమాను వచ్చే సంక్రాంతి పోరులో దించాలని నిశ్చయించుకున్నారు. కానీ కరోన రెండో దశ విజృంభిస్తున్న తరుణం లో అన్ని అనుకూలంగా వుంది షూటింగ్ జరిగితే… గాని రిలీజ్ ఎప్పుడో తెలుస్తుంది. ఈ సినిమా కోసం అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాపై ప్రారంభం నుంచి అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఇక ఇటీవల విడుదలైన పోస్టర్‌లు సినిమాపై ఉన్న అంచనాలను మరింత అధికం చేశాయి. ఈ సినిమాకు పరశురామ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో మహేష్ సరసన కీర్తి సురేష్ లీడ్ రోల్‌లో నటిస్తున్నారు. ఈ సినిమా బ్యాంక్ కుంభకోణం నేపథ్యంలో తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.
అయితే తాజాగా ఈ సినిమా గురించి సరికొత్త రూమర్ స్ట్రాంగ్ బజ్ క్రియేట్ చేస్తోంది. ఈ నెల చివరిలో మహేష్ తండ్రి సూపర్ స్టార్ కృష్ణ గారి పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమా నుంచి ఓ అప్‌డేట్ రానుంది. ఈ మేరకు అధికారిక ప్రకటన కూడా వచ్చింది. అయితే అప్పుడు వచ్చే అప్‌డేట్ ఏమై ఉంటుందని అభిమానులు ఇప్పటినుంచే ఊహాగానాలు మొదలు పెట్టారు. అయితే ప్రతి ఏడాది అయన పుట్టిన రోజున సంథింగ్ స్పెషల్ ఏదైనా ఉంటుంది. అలాగే ఈ ఏడాది కూడా ఓ పోస్టర్‌తో సరిపెడతారని టాక్ నడుస్తోంది. కానీ ఈ సారి పక్కా సాలిడ్ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేసేందుక ఎక్కువ అవకాశాలు ఉన్నట్లు సినీ సర్కిల్స్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇందులో నిజమెంతనేది తెలియాలంటే అప్పటి మే 31వరకు వేచి చూడాల్సిందే.